కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖమ్మం సుడా చైర్మన్

 

రఘునాథ పాలెం మార్చి 15 ( జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలు మేరకు బుధవారం రఘునాధపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామం నందు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ: ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఉచితంగా అందించే కళ్లద్దాలను పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెంటం రామారావు, మండల అధ్యక్షులు అజ్మీర వీరు నాయక్, ఎంపీటీసీ మాలోత్ లక్ష్మి,మంత్రి పీ.ఏ చిరుమామిళ్ల రవి కిరణ్,నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు,ఉప సర్పంచ్ కె.వి.ఆర్,రహీం ఖాన్,నాగేశ్వరరావు, భాష,ఎంపీడీవో రామకృష్ణ,కంటి వెలుగు వైద్య సిబ్బంది,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు…