కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వేమనపల్లి,మార్చి16 ,(జనంసాక్షి):మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండోదఫా కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ మోర్ల పద్మ-మొండి,ఎంపిడిఓ అల్లూరి లక్ష్మయ్య, క్యాంపు మెడికల్ ఆఫీసర్ వారిస్ పటాన్ లు ప్రారంభించారు.ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు.ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి,కళ్లఅద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అందజేస్తుందని అన్నారు.18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పున్నం,పంచాయతీ కార్యదర్శి సాయి, వార్డు సభ్యులు,ఏపీవో సత్యప్రసాద్,సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ,కంటి పరీక్ష నిపుణులు చైతన్య ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ లింగయ్య,బాపు,మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు,ఏఎన్ఎం కళావతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.