కంటి వెలుగు సక్రమంగా నిర్వహించాలి..
ఊరుకొండ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని.. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలని మండల వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ అభిలాష్, క్లస్టర్ అధికారి నటరాజ్, వైద్య సిబ్బంది ప్రసాద్, యుగేందర్ సింగ్, మంజుల, పద్మ, ఆశా కార్యకర్తలు నర్మద, తదితరులు పాల్గొన్నారు.