కబడ్డీ పోటీలలో జీనియస్ గామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

శామీర్ పేట్, జనంసాక్షి :
జగన్ గూడ జీనియస్ గ్రామర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి.సిద్ధార్థ్ మరియు డి. నర్సింలు స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 23వ తేదీన శనివారం రోజున జరిగినటువంటి 67వ డిస్టిక్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ ఘట్కేసర్ లో నిర్వహించారు. శామీర్ పేట్ జోన్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ సత్తి రెడ్డి ఈ ఇద్దరు విద్యార్థులు చురుకైన ప్రతిభను కనబరిచి నందున స్టేట్ లెవెల్ కి ఎంపిక చేశారు.జీనియస్ గ్రామర్ హై స్కూల్ కరస్పాండెంట్ జె కిష్టారెడ్డి మరియు ప్రిన్సిపాల్ కల్పనా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపల్ ఆంటోనీ ఎడ్విన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు డిస్టిక్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్ కి ఎంపిక చేయబడిన విద్యార్థులకు మరియు జీనియస్ స్కూల్ పిఈటి కోచ్ గౌతమ్ కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ స్టేట్ నుండి నేషనల్ కూడా సెలెక్ట్ కావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
26ఎస్పీటీ -1: ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో కిష్టారెడ్డి

తాజావార్తలు