కరెంటు ఇవ్వకపోయినా చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ అసమర్దత వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని కరెంట్‌ ఇవ్వకపోయినా చార్జీలు మాత్రం ముక్కు పిండి వసూల్‌ చేస్తున్నారని ప్యాపీ అధ్యక్షుడు బీవీ రామారావు, మాజీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆరోపించారు. వరుస విద్యుత్‌ కోతలతో కూలీలు, పరిశ్రమలన్నీ మూతపడి రోడ్డునపడ్డాయని విద్యుత్‌ కోతలకు తక్షణ పరిష్కారం చూపాలని పరిశ్రమలకు బ్యాంక్‌ రుణాలపై మారటోరియం విధించాలని డిమాండ్‌ చేశారు.