కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. తిరుపతివాసి మృతి

తిరుపతి: కర్ణాటక రాష్ట్రంలోని హోన్‌కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిపిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండెక్టర్‌ మునుస్వామి మృతి చెందాడు. తిరుపతి నుంచి హోన్‌కోట ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి బయలు దేరింది. ఈ ఉదయం హోన్‌కోటలో  ప్రయాణికులను దించి కిందికి దిగిన కండెక్టర్‌ను కార్ణటక ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.