కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనం సాక్షి మంథని : మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ముత్తారం మండలం (11), రామగిరి మండలం(11) పాలకుర్తి( 4) కల్యాణ లక్ష్మి చెక్కులను మొత్తం 26 లబ్ధిదారులకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 58 జి.వో ప్రకారం అసైన్డ్ భూమిలో ఇండ్లు నిర్మించుకున్న మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి మండలానికి చెందిన 11 మంది అర్హులైన లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అందజేశారు.