కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన టిపిసిసి సభ్యులు మరి నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 24(జనం సాక్షి)
టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి  ఆధ్వర్యంలో  శుక్రవారం కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పోల్కంపల్లి గ్రామంలో ఈ నెల ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు హాత్ సే హత్ జోడో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేయుచున్నారు కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ఎం ఎన్ ఆర్ యువసేన టీం సభ్యులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం పార్టీ మాజీ అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్  ప్రసిడెంట్ శంకర్ గౌడ్, నాయకులు జంగారెడ్డి, రజనీకాంత్ గౌడ్, రామ్ రెడ్డి, ఉదయపాల్ రెడ్డి,బుపతి గళ్ళ రాజు, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, ఎం ఎన్ ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, మనోజ్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు చరణ్ ముదిరాజ్,మహేష్ గౌడ్,ధనరాజ్,రమేష్ రాథోడ్,rk ప్రవీణ్, మరియు సర్పంచులు ,ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు,సహకార సంఘం డైరెక్టర్లు,  పోల్కంపల్లి గ్రామ ముఖ్య నాయకులు పల్సం అబ్బాయ్య,అశోక్ గౌడ్,వెంకటేష్ గౌడ్,జంగయ్య,శ్రీనివాస్, అశోక్,శివ ప్రసాద్, శ్రీను,విక్రమ్,తదితరులు పాల్గొన్నారు.