కరీంనగర్ లో జర్నలిస్టులపై పోలీసుల జులుం

కరీంనగర్‌:  విద్యుత్‌ కోతకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో జరిగే ముట్టడి, ధర్నా కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి నిరసనగా ఏపీయూడబ్లూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు రాస్తారోకో చేస్తున్నారు.