కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పరీక్షా ప్యాడ్స్ పంపిణీ
మునగాల, మార్చి 11(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలోని కేజిబివిలో విద్యార్డులకు కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బుక్స్, పరీక్షా ప్యాడ్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విద్యుత్ శాఖ ఏఈ జిల్లా శంకర్ మాట్లాడుతూ, మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాయబోతున్న పదవ తరగతి విద్యార్దులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపిచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. చదువు నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదాడ మండలం కాపుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్డులకు బుక్స్ అందించినట్లు తెలిపారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా విద్యార్డులకు అల్ ఇన్ ఒన్ బుక్స్, పరీక్షా ప్యాడ్స్ అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేజిబివి ఎస్‌ఓ సునీత, జిల్లా సుధాకర్, శ్రీకాంతాచారి, దేవరశెట్టి నాగేశ్వరరావు, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.