కాంగ్రెస్ భేటీలో తెలంగాణ రగడ
హైదరాబాద్: నగరంలోని ఎల్‌బీ స్టేడియమ్‌లో ఆదివారం ఉదయం మొదలైన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాంలో ప్రారంభంలోనే తెలంగాణ అంశంపై రగడ చోటుచేసుకుంది. తెలంగాణ అమరవీరులకు సంతాపం ప్రకటించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ వ్యక్తం చేశారు. దీనిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సున్నితంగా తోసిపుచ్చారు. దాంతో తెలంగాణ ఎంపీలు లేసి సంతాపం ప్రకటించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఆజాద్ సమక్షంలోనే నేతలు వాగ్యుద్ధానికి దిగారు. తెలంగాణవాదులు జై తెలంగాణ నినాదాలు ప్రారంభించారు. దీంతో సమైక్యవాదులు కూడా సమైక్య నినాదాలకు దిగారు. ఇరుప్రాంతాలవారికి బొత్స సర్దిచెప్పి ఇరుప్రాంతాల అమరవీరులకు, నీలం మృతులకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు. దీంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత సమావేశాంలో ఈ గొడవ మళ్ళీ రేగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సమావేశానికి ఒకే వాహనంలో వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలలో ఓ ఒక్కరుకూడా వేదికపైకి ఎక్కకపోవడం విశేషం.