కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు.
మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చ26.
నేరెడ్ మెట్ 136 డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు జాన్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు,సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందడం లేదని బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.