కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలు స్వాధీనం

గుంటూరు: జిల్లాలో గుజ్జనగుండ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జేకేసీ కళాశాల పరిసరాల్లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే  వ్యక్తి తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు వివరించాడు. అయితే పోలీసులు ఆదాయపుపన్ను, రిజిస్ట్రేషన్‌ శాఖకు సమాచారం ఇస్తామని.. తగిన ఆధారాలు చూపించి నగదు తీసుకెళ్లాని సూచిస్తూ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేశారు.

తాజావార్తలు