కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం.కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం.ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి


జనం సాక్షి ,(భువనగిరి ఆర్.సి న్యూస్) ;
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో  మండల టిఆర్ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో 12 (అనాజిపురం, నాగిరెడ్డిపల్లి, నందనం, బొల్లెపల్లి , సూరపల్లి , ఆకుతోట బాయి తండా, పచ్చర్ల బోర్డు తండా, రెడ్డి నాయక్ తండ,ఎర్రంబ్ పల్లి,నమత్ పల్లి, తొక్కపురం,సిరి వేణి కుంట) గ్రామాలకు చెందిన కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కోలాటాలతో, డీజే సప్పులతో  డోలి వైద్యాలతో, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఘన స్వాగతం పలికినారు . ఆయన మాట్లాడుతూ  బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో చర్చకి  తీసుకెళ్లాలి.అన్ని వర్గాల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేయాలని. అన్నారు.ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ప్రతి పల్లెకి  అభివృద్ధి. ప్రతి ఇంటికి  ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని  తెలియజేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించక ముందున్న పరిస్థితులు,తెలంగాణ ప్రగతి ప్రస్థానం రాష్ట్రం ఏర్పడ్డాక మారిన ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా ఆయన వివరించారు కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని ఆయన అన్నారు.ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధం బలోపేతం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దశ, దిశ, నిర్దేశం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయిల్ ఫామ్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరెందర్ గౌడ్,బీరు. మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం. పాండు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ , , నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచి జక్క. కవిత రాఘవేంద్ర రెడ్డి,  మరియు , సర్పంచులు , ఎంపిటిసిలు , కార్యకర్తలు , అభిమానులు ,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు