కాళేశ్వరి ట్రావెల్స్‌పై హెచ్చార్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌ : మహారాష్ట్రలో జరిగిన ఘోర దుర్ఘటనలో 30 మంది మరణానికి,మరికొంత మంది గాయపడటానికి కారణమైన కాళేశ్వరి ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్‌ ఇనే న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.ఈ ప్రమాదానికి ముమ్మాటికీ ట్రావెల్స్‌ నిర్వాహకులే బాధ్యతవహించాలన్నారు.  లక్డీకాపూర్‌లో ఉన్న ఈ ట్రావెల్స్‌ బస్సులను ఇతర రాష్ట్రాల్లో రిజిష్టర్‌ చేయించుకుని ఆంధ్రప్రదేశ్‌లో నడుపుతున్నారని సదరు న్యాయవాది ్‌ కమిషన్‌ దృష్టికి తీసుకవెళ్లారు. అనుమతులు లేకున్నా బస్సులు నడుపుతున్న ట్రావెల్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సు డ్రైవర్ల పని గంటల కంటే ఎక్కువ పని చేయించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.