కాశ్మీర్‌ ముగ్గురు తీవ్రవాదుల అరెస్టు

శ్రీనగర్‌: హిజ్‌బుల్‌ మజాయిద్దీన్‌ సంస్థకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్‌లో గ్రామ సర్పంచిలపై బెదిరింపులకు పాల్పడుతున్న వీరినికుల్గామ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల బెదిరింపులతో కాశ్మీర్‌లో 140 మందికిపైగా సర్పంచిలు తమ పదవులకు రాజీనామా చేశారు. గత నెలలో ఇద్దరు సర్పంచిలు హత్యకు గురైన నేపథ్యంలో తమకు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వాలని కోరుతున్నారు.