కిరణ్‌, బొత్సలతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణతో ఈరోజు ఉదయం పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాద్‌, కన్నా లక్షీనారాయణ, రఘువీరా రెడ్డి, డీకే అరుణ, విశ్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.