కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతుల సమావేశం

గుంటూరు: కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతు కార్యాచరణ సమితి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డెల్టా సమస్యపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణా డెల్టా సమస్యపై ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన చెప్పారు. సాగు, తాగు నీటికి జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి మొద్దునిద్ర పోతున్నారని  దేవినేని ఉమ ఆరోపించారు. కర్ణాటక నుంచి నీటిని తీసుకువచ్చి డెల్టాను కాపాడాలని ఆయన కోరారు. నీటి విడుదలపై ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్‌ వేయకపోవడం బాధ్యతారామిత్యమని ఉమా విమర్శించారు.