కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన 

 లింగాల జనం సాక్షి ప్రతినిధి
లింగాల మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో 10వ,తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రామిక వికాస కేంద్రం  మండల కో ఆర్డినేటర్  యం శ్రీనివాసులు మాట్లాడుతూ కెరీర్ అనేది ఒక వ్యక్తి యొక్క అనేక సంవత్సరాల జీవితాన్ని ప్రభావితం చేసే ఒక క్లిష్టమైన ఎంపిక. కోర్సు మరియు కెరీర్ ఎంపికలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.10వ తరగతి పూర్తయిన తర్వాత చాలా మంది విద్యార్థులు 2 సంవత్సరాల కోర్సు అయిన ఇంటర్మీడియట్‌ను ఎంచుకుంటారు. విద్యార్థులు సైన్స్, కామర్స్ మరియు మాథ్స్ మూడింటిలో ఒక సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులలో మెకానికల్, ఆటోమొబైల్, సివిల్, కెమికల్స్ మరియు కంప్యూటర్ వంటి పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసించవచ్చు. మనకు జిల్లా లో అందుబాటులో పాలిటెక్నిక్ కళాశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ మసమ్మ. విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.