కేంద్రం పేద ప్రజల హక్కులను హరిస్తోంది – రాహుల్‌ గాంధీ

 

న్యూఢిల్లీ,డిసెంబరు 10 (జనంసాక్షి): కేంద ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను హరిస్తోంది కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘పేదల హక్కులను లాక్కుంటోంది. ఇది మానవత్వానికి వ్యతిరేక నేరం. ఈ దేశ ఉత్తమ భవిష్యత్తు కోసం మనం అన్ని వర్గాలను గౌరవించాలి’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రతి ఏటా డిసెంబరు 10న మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్‌ 10న సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఆమోదించిన నేపథ్యంలో దినోత్సవాన్ని జరుపుకుంటారు.