కేంద్రం మెడలు వంచిన రైతులకు జేజేలు

బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌

హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం సంతోషకరమని బీఎస్పీ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందలాది రోజులు పోరాడరని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచిన అన్నదాతలకు ఆయన జేజేలు తెలిపారు. ’రైతు వ్యతిరేక చీకటి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం ప్రకటించడం సంతోషకరం. గత వందలాదిరోజులుగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన అన్నదాతలకు జేజేలు’ అని ఆయన ట్వీట్‌ చేశారు.