కేసీఆర్‌ను కలిసిన పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెరాస అధినేత కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కేసీఆర్‌ నివాసానికి బొత్స వెళ్లారు. నవంబర్‌ 2వ తేదీన బొత్స కుమారై వివాహం ఉన్నందున ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. దాదాపు ఆరగంటపాటు బొత్స, కేసీఆర్‌ మాట్లాడుకున్నారు.