కేసీఆర్‌ చెప్తున్నది బోగన్‌ ట్రస్ట్‌: మోత్కుపల్లి

హైదరాబాద్‌: అమరవీరుల కోసం కేసీఆర్‌ పెడతానంటున్న ట్రస్ట్‌ బోగన్‌ అని తెదేపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.కేసీఆర్‌ను తెలంగాణ అబద్ధాల కోరుగా అభివర్ణించారు. తెలంగాణాకు టీడీపీ కట్టుబడే ఉందని మరోమారు స్పష్టం చేసిన ఆయన అవసరమైతే మరోమారు కేంద్రానికి లేఖ రాస్తామని  తెలియజేశారు. తెలంగాణాకు సోనియా అనుకూలమని  ప్రధాని వ్యతిరేకమని మధుయాష్కి మాట్లాడడం అర్థరహితమన్నారు.