కొత్త విత్తన చట్టాన్ని రూపొందించిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతేకంగా కొత్త విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వ్వవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాక్ష్మీన తెలిపారు. అన్ని జిల్లాల వ్వవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం మలక్‌పేట వ్వవసాయశాఖ సమితి కార్యాలయంలో ఆయన ప్రరంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతు విత్తన చట్టానికి సంబంధించి పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న బిల్లులో తాము ప్రతిపాదించిన 17 సవరణలను చేర్చడానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌ పవార్‌ అంగీకరించారని కన్నా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల సాగు తగ్గినా యూరియా కొరత ఎందుకు వస్తోందన్న అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు. వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 27 వేత క్వింటాళ్ల ఇతర విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్‌ పంట నష్టాలకు పెట్టుబడి రాయితీగా ఇచ్చిన నిధులు ఎందుకు పంపిణీ చేయడం లేదనే అంశంపై నివేదిక ఇవ్వమని అధికారులను అడిగినట్లు తెలిపారు.