కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొనసాగుతోంది. ఓటు వేసేందకు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఓటు వేసిన వారిలో స్పీకర్‌ నాదెండ్ల, లోక్‌సత్తా ఎమ్మెల్యే జేపీ, మంత్రులు జానారెడ్డి, పార్థసారధి, సీపీఎం ఎమ్మెల్యేల రాంగారెడ్డి, కాంగ్రెస్‌, వైకాపా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.