కొల్చారం లో బెల్ట్ షాప్ ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బెల్ట్ షాపులను మూసివేయాలని
ఎంపీపీ మంజుల కాశీనాథ్ ,జనం సాక్షి కొల్చారం మండల కేంద్రంలో నేడు ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశం కి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు హాజరయ్యారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు వచ్చే వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మద్యానికి బానిసలుగా మారి యువత చెడు మార్గం వైపు ప్రయాణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే బెల్టు షాపులు మూసివేయాలని సమావేశంలో తీర్మానించారు ఈ కార్యక్రమంలోఎంపీపీ మంజుల కాశీనాథ్ ఎంపీడీవో గణేష్ రెడ్డి ఎమ్మార్వో చంద్రశేఖర అగ్రికల్చర్ శ్వేత కుమారి సర్పంచ్ వీరారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గోదావరి తదితరులు పాల్గొన్నారు