కోటగిరికి 50 పడకల ఏరియా ఆసుపత్రి మంజూరు చేయడం శుభపరిణామం.మండల అద్యక్షులు ఎజాజ్ ఖాన్.
కోటగిరి ఫిబ్రవరి 25 జనం సాక్షి:-తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఉమ్మడి కోటగిరి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ పేర్కొన్నారు.శనివారం రోజున కోటగిరి మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో 30 పడకల కోటగిరి ఆస్పత్రిని 50 పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరిస్తూ రూ 13 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్,హెల్త్ మినిష్టర్ హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి, ఆస్పత్రి ఆవరణంలో పటాకులు పేల్చి,రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ ఉమ్మడి కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక అయిన 30 పడకల కోటగిరి ఆసుపత్రి ని 50 పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరణపై ఉమ్మడి కోటగిరి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.అందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు,స్పీకర్ ప్రచార శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తూ కోటగిరి మండల బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున వారిరువురికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్ర మంలో ఎంపీపీ వల్లేపల్లీ సునిత శ్రీనివాస్,సర్పంచ్ ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్,జిల్లా కో ఆప్షన్ సిరజుద్ది న్,ఎయంసి ఛైర్మెన్ అబ్దుల్ హమీద్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,కొల్లూరు కిషోర్,మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకు లు,కార్యకర్తలు ఆస్పత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.