కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం సూపరింటెండెంట్ డాక్టర్ నెమ్మాది రజిని
కోదాడ, మార్చి6(జనం సాక్షి)
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగుల సౌకర్యార్థం డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి రానున్నదని కోదాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నెమ్మాది రజిని తెలియజేశారు. వారు మాట్లాడుతూ మార్చి 8వ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఇతర ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల ఆధ్వర్యంలో ఇట్టి సేవలను ప్రారంభించనున్నట్లు వారు తెలియజేశారు. ఇప్పటివరకు కిడ్నీలు దెబ్బతిన్నవారు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు సూర్యాపేట ,ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేసుకునే వారని ఇప్పుడు కోదాడలో ప్రారంభం కాబోతున్న కిడ్నీ డయాలసిస్ యూనిట్ వల్ల మన ప్రాంత ప్రజలకు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొల్లం మల్లయ్య యాదవ్ ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తానని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నెమ్మాది రజిని తెలియజేశారు. దీంతో పాటుగా రోగుల సహాయకుల సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి గది కూడా అందుబాటులోకి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వీరి వెంట డాక్టర్లు సైదులు, విజయ్, సురేష్ , నారాయన్ ఆసుపత్రి స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు.