కోమట్‌రెడ్డి బ్రదర్స్‌పై తెలంగాణవాదుల ఫైర్
హైదరాబాద్: సమైక్యవాది అయిన వైఎస్ జగన్‌కు మద్దతుగా మాట్లాడిన ఎంపీ కోమట్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కోమట్‌రెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులని, తెలంగాణను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందు నుంచి వారిపై అనుమానంగానే ఉందని, గతంలో కోమట్‌రెడ్డి తెలంగాణ కోసం చేసింది. దొంగ దీక్షేనని పలువురు ఆరోపించారు. జగన్ వల్లే రాష్ట్ర బాగు పడుతుందని, వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలవల్లే రాష్ట్ర బాగుపడుతుందని, వైఎస్ తమకు చేసిన మేళ్ళకు రుణం తీసుకుంటామని కోమట్‌రెడ్డి సోదరులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణవాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.