క్కరు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఒ

హుజూర్ నగర్ ఫిబ్రవరి 24 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్స్ వారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శిక్షణ కాలాన్ని పూర్తిచేసిన వారికి హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు టీ షర్ట్స్, సర్టిఫికెట్ తో పాటు 4500/-స్టెప్ అండ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ వారి సహకారంతో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా, లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తాపీ పని ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటర్లకు 15 రోజులు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించి, శిక్షణ కాలంలో మధ్యాహ్న భోజన సదుపాయం అందుబాటులో ఉంటుందని కనుక ప్రతి ఒక్కరు నైపుణ్యత పెంచుకోవాలని తద్వారా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, వర్తిస్తుందని అన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో బ్యాంకర్స్ ద్వారా లోన్స్ కూడా వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధ్యాపకులు సుదర్శన్, నమ్మా నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేదరి శ్రీను, గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షుడు జింకల శ్రీను, శాఖమూరి పాపారావు, జింకల పెద్ద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.