క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట.క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట.
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.నెన్నెల, మార్చ్ 29, (జనంసాక్షి )క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని చిత్తపూర్ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం యువత క్రీడల్లో రాణించాలానే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. యువత ఖాళీ సమయాన్ని క్రీడలకు కేటాయించి క్రీడల్లో రాణించి మంచిపేరు సంపాదించుకోవాలన్నారు.
విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి.
విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం ఆయన చిత్తపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల 49వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంగా చదివి తమ తల్లిదండ్రుల కలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఫలితం ఉంటుందన్నారు. చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని వివరించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఘన స్వాగతం పలికారు. నృత్యాలతో అలరించారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, సర్పంచ్ బత్తిని పద్మ వెంకటేష్ గౌడ్, మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్, సింగల్ విండో వైస్ చైర్మన్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ ఓరేం కమల, సింగల్ విండో డైరెక్టర్ మహేందర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి రత్నం మధుసూదన్,నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.