క్వారీలో ప్రమాదం…. ఇద్దరు కార్మికుల మృతి

గుంటూరు : ఫిరంగిపురం క్వారీలో రాళ్లు దొర్లిపడి ఇద్దరు కార్మకులు మృతి చెందారు. కార్మికులు క్వారీ వద్ద పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.