ఖరీఫ్‌లో ఎరువుల కొరత రానీయం
నల్లగొండ,మార్చి25 : రానున్న ఖరీఫ్‌లో సంఘాల నుంచి ఎరువుల కొరత లేకుండా చేసేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. ఎక్కడెక్కడ ఎంత అవసరమో గుర్తించి ముందే ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ప్రాథమిక సంఘాలకు సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు కృషఙచేస్తామని అన్నారు. అలాగే సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. సంఘాల నుంచి చిరువ్యాపారులకు రుణసౌకర్యం అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 91 సహకార సంఘాలకు పక్కా గోదాంల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. వీటిని త్వరలోనే నిర్మాణం చేస్తామని అన్నారు.