గడువు ముగుస్తున్నా ప్రవేశాలు కల్పించని వైద్య కళాశాలలు

విజయవాడ: గడువు ముగుస్తున్నా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు కల్పించని ప్రైవేటు వైద్య కళాశాలలపై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం రేపటిలోగా ఎ, బి కేటగిరి విద్యార్థులను చేర్చుకోని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని మూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఐవీ రావు తెలియజేశారు.