గణనాధునికి వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు….
టేకుమట్ల.సెప్టెంబరు01(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన న్యాయమైన హామీలను అమలు చేయాలని మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకులు వినాయక విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికీ 39 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటలేదా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించి వెంటనే వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు ఈర్ల స్వామి,కూరపాటి రవీందర్, సురేష్,రజిత,అప్సర,మౌనిక, జితేందర్,సందీప్ లు పాల్గొన్నారు.