గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీత

హైదరాబాద్‌: గండిపేట చెరువులో ఆదివారం గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. బండ్లగూడలోని షాదన్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మహ్మద్‌ అబ్దుల్‌హై(24), మహ్మాద్‌ అలీముద్దీన్‌ (23),హకీం నిన్న గండిపేట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇందులో హకీంను స్థానికులు రక్షించగా. గల్లంతైన ఇద్దరి కోసం నిన్నటి నుంచి ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఉదయం మృతదేహాలను వెలికి తీశారు.