గాంధీ ఆసుపత్రిలో లేబర్‌వార్డు మూసివేత

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో 10రోజుల పాటు లేబర్‌వార్డును అధికారులు మూసివేశారు. ధనుర్వాతం వైరస్‌ సోకిందని అధికారులు ఆ వార్డును మూసివేశారు. ఇతర ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.