గాలి బెయిల్‌ కేసులో నిందితులను రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, చలపతిరావులకు ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. రౌడీషీటర్‌ యాదగిరికి కూడా ఈ నెల 17 వరకు రిమాండ్‌ను పొడిగించింది. మాజీ జడ్జీలు లక్ష్మీనర్సింహారావు, ప్రభాకర్‌రావు, రావి, సూర్యప్రకాశ్‌బాబులకు ఈ నెల 14 వరకు  రిమాండ్‌ పొడిగించారు.