గాలి బెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: గాలిబెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు ప్రమేయాన్ని లక్ష్మయ్య చౌదరి ప్రస్తావించారు. స్నేహితుడు సూర్యప్రకాశ్‌తో ఏప్రిల్‌ 20న బళ్లారిలో శ్రీరాములును కలిసినట్లు లక్ష్మయ్య చౌదరి పేర్కొన్నారు. గాలి జనార్థన్‌రెడ్డికి సహాయం చేయాలని శ్రీరాములు తమను కోరారన్నారు. కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు ఫోన్‌ నెంబరును సూర్యప్రకాశ్‌కు శ్రీరాములే ఇచ్చారన్నారు.