గిరిజనబంధు అమలు చేయండి

share on facebook

గిరజనుల ఆందోళన
ఆదిలాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని
జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలని, లంబాడా లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్నారు. దళితబంధులాగా తమకు కూడా తక్షణం అమలు చేయాలన్నారు. పోడుభూముల సమస్యను తోణం పరిష్కరించాలన్నారు.

Other News

Comments are closed.