గిరిజనుల అభివృద్ధికి కృషి : బాలరాజు

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి బాలరాజు అన్నారు. శుక్రవారంనాడు ఆయన ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవ రాష్ట్రస్థాయి మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో పధకాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు చేపట్టి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు మహాసభలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు మహాసభను జయప్రదం చేయాలని కోరారు.