గిరిజనుల సంక్షేమానికి కృష్టి : మంత్రి బాలరాజు
రాజమండ్రి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశాఖ మంత్రి పనుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 126 గిరిజన బాలుర వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు ఒక్కో దానికి కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని వివరించారు. అదనంగా యువతకు శిక్షణా కేంద్రాలు కూడా నిర్మించాలని యోచిస్తున్నామన్నారు. రాజమండ్రిలో నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.