గిరిజనేతర్ల సమస్యలపై తహసిల్దార్ కి వినతి.

గిరిజనేతర్ల సమస్యలపై తహసిల్దార్ కి వినతి.-పలు అంశాలపై వినతి పత్రం అందజేసిన గిరిజనేతల సంఘం నాయకులు.
మంగపేట,మార్చి21(జనంసాక్షి):-
మంగపేట మండలములో నివసిస్తున్న గిరిజ నేతరులు తమ సమస్యలను పరిష్కరించాలనికోరుతూ గిరిజనేతరుల సంఘం మండల కమిటీఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్ నుంచి తహసీల్దార్కార్యాలయం వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందుగా అంబేడ్కర్ భవన్లోమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనేతరులతో పెద్ద ఎత్తున ప్రత్యేకసమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగాపలువురు గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. మంగపేట మండలంఏజెన్సీ, నాస్ఏజెన్సీ అనే విషయం హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఏజెన్సీసర్టిఫికెట్లు జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు.అనంతరం ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శ్రీనివాసులుకు అందజేశారు. ధరణి పోర్టల్ విషయంపై కోర్టు ఆర్డర్ప్రకారంగా మండలంలో ధరణీలో భూమార్పిడిచేసుకునే విధంగా గిరిజనేతరుకు అవాశంకలించాలన్నారు. పట్టా ఉన్న ప్రతి గిరిజనేతరుడికి ఇంటి నిర్మాణంకోసం నాలా అనుమతి ఇవ్వాలని, మంగపేట మండలం ఏజెన్సీ, నాన్ఏజెన్సీ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదన్నారు.ఈ కార్యక్రమంలోఎమ్మార్వో ఎంపెల్లి వీరస్వామి గిరిజనేతర సంఘం నాయకులు చింతా పున్నారావు, బండ జగన్మోహన్ రెడ్డి, అనుముల రాఘవరెడ్డి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు,బసారికాని హరికృష్ణ,పరికి శ్రీను, ఎల్పీముత్యాలు, దీగొండ కాంతారావు, ముత్తినేనిఆదినారాయణ, గోనె శ్రీనివాస్ రెడ్డి, పయ్యావులనర్సింహారావు, పసుపులేటి సుబ్బారావు, తూడిభగవాన్రెడ్డి, నాధారపు వీరస్వామి, కంచర్ల దుర్గారావు, కోడెల నరేష్, చిలకమర్రి శ్రీనివాస్, తోటఅశోక్ కుమార్, మువ్వ కోటేశ్వర్రావు, భసకుమార్, మార్పుల వెంకట్రెడ్డి, నర్రావోజు ప్రవీన్శివప్రసాద్, కాటూరి సుగుణ, పగిడిపల్లి చంద్రం,,నిమ్మగడ్డ ప్రవీణ్, సురేష్పాల్గొన్నారు.