గుండారంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ


జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవ తో కమాన్ పూర్ పిల్లిపల్లె నుండి పెద్దమ్మ టెంపుల్ వరకు దారి రోడ్డుకు ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ గారు కొబ్బరికాయ కొట్టి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, స్థానిక వార్డ్ సభ్యుడు పిట్టల శంకర్, నాయకులు రాచకొండ రవి, మబ్బు శంకర్, పిడుగు భీమయ్య, రాచకొండ రాములు, పిట్టల బాలు, ఉదారి కనకయ్య, పిడుగు లస్మయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.