ఏసీబీ వలలో వీఆర్వో

దౌల్తాబాద్‌ : లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం రామ్‌సాగర్‌ వీఆర్వో బాలయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్థానికంగా నివసించే చిట్టిమైన పోషయ్య అనే వ్యక్తి తన భూమి పట్టా మార్పిడి కోసం వీఆర్వోను శనివారం సంప్రదించగా ఇందుకోసం అధికారి రూ 2 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో సోమవారం ఇస్తానని చెప్పి పోషయ్య ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు. ఈ రోజు పోషయ్య లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.