గృహ వినియోగదారులపై సర్‌ఛార్జీల మోత

హైదరాబాద్‌: గృహ వినియోగదారులపై సర్‌ఛార్జి మోపేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు సిద్దమయ్యాయి. ఈ మేరకు విద్యుత్‌ నియంత్రణ మండలకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. గృహ వినియోగదారుడికి యూనిట్‌కు రూ. 1.62 పైసలు అదనపు భారం పడనుంది. దీనిపై ఈ అభ్యంతరాలను ఈ నెల 31 లోపు తెలపాలని ఈఆర్‌సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 2010-11, 2011-12 సంవత్సరాల సర్‌ఛార్జీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విధ్యుత్‌ ఈఆర్‌సీ తెలిపింది.