గేదెను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
– అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన విద్యార్థి
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మరణించిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ శివారులో సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సార మోహన్(22) అతని స్నేహితునితో కలిసి బైకుపై హత్నూర మండలం దౌల్తాబాద్ కు వచ్చారు.పని ముగించుకుని తిరిగి వారి స్వగ్రామం అతి వేగంగా వెళ్తున్న క్రమంలో మంగాపూర్ గ్రామ శివారులో ప్రధాన రహదారిపై అడ్డుగా వచ్చిన గేదెను బలంగా ఢీ కొట్టారు.ఈ ప్రమాదంలో మోహన్ తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.గేదె సైతం అక్కడే మృత్యువాత పడిందని పోలీసులు తెలిపారు.తీవ్రంగ గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వారు పేర్కొన్నారు.మృతుని తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.