గోపాల్ పేట్ గ్రామ పంచాయతీకి నిరంతర అభివృద్ధి పంచాయతీ పురస్కారం

గోపాల్ పేట్, మార్చ్ 24, జనంసాక్షి​ :
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం తమ గ్రామ పంచాయతీకి రావడం ఆనందంగా ఉందని గోపాల్ పేట్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అందరి కృషితోనే తమ పంచాయతీకి ఉత్తమ పురస్కారం వచ్చిందని తెలిపారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. గోపాల్ పేట్ ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించిన సందర్బంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ భార్గవి, ఎంపీడీఓ హుస్సేన ప్ప లు సర్పంచ్ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి బాలరాజు కు ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు.