గ్యాస్‌ కెటాయింపులపై అందోళన చెందాల్సినదేమీ లేదు : జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు గ్యాస్‌ కేటాయింపులు కొనసాగుతాయని ఆందోళన చెందాల్సినదేమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపు విషయంపై ఈరోజు ఆయనతో మహారాష్ట్ర సీఎం, డిప్యుటీ సీఎం భేటీ అయ్యారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులు రద్దు చేశారని ఆయన మీడియాకు తేలిపారు. ఆంద్రప్రదేశ్‌లో విద్యుత్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని రత్నగిరి గ్యాస్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని చెప్పానని మంత్రి చెప్పారు.