గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ మిన్నంటిన నిరసనలు – పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలు – కేంద్ర ప్రభుత్వానికి తాకిన గ్యాస్ ధరల సెగలు – మల్లీ కట్టెల పొయ్యిలే దిక్కు అంటున్న పేద నిరుపేద మహిళలు

హుజూర్ నగర్ మార్చి 2 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ హుజూర్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో మిన్నంటాయి.
కేంద్ర ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరిచేలా గ్యాస్ ధరల పెంపు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం గురువారం బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటూ నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ
మిన్నంటిన నిరసనలు, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఖాళీ గ్యాస్ సిలిండర్ల కు నల్లజెండాలు కట్టి, మెయిన్ రోడ్డుపై కట్టెల పొయ్యితో వంట చేసి బారి ఎత్తున బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, నినాదాలు చేస్తూ వారి యొక్క నిరసన జ్వాలలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు గోల్డ్ పిచ్చయ్య, కౌన్సిలర్లు కొమ్మ శ్రీను, జక్కుల శంభయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మ వీరారెడ్డి, ములకలపల్లి రామ్ గోపి, చిలకపత్తిని సౌజన్య ధనుంజయ్, గుండా ఫణి కుమారిరామ్ రెడ్డి, వీర్లపాటి త్రివేణిభాస్కర్, అమరబోయిన గంగరాజు, మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మరాంరెడ్డి, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, టిఆర్ఎస్కెవి అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్, చెవుల కవిత, పట్టణంలోని వివిధ వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, ప్రజలు, మహిళలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.